మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలో ఓడిసియంఎస్ ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు తమ పంటను విక్రయించాలని సూచించారు. దళారుల ద్వారా మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు.