సహాయక చర్యల్లో హోంమంత్రి

VSP: సింహాచలంలోని గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంతో హోంమంత్రి అనిత సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. హోమ్ మంత్రితోపాటు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.