VIDEO: ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తజనం
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్య అర్చకులు మల్లాచారి ఆధ్వర్యంలో వేదోక్తంగా పూజలను జరిపించారు. భక్తులు అమ్మవారికి చీరె సారె బోనాలను సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తగు ఏర్పాటు చేశారు.