అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన

అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన

NLG: చందంపేట మండలం కంబాలపల్లి సెక్టార్‌లోని కే-చెంచు కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమాలలో భాగంగా సోమవారం సామూహిక అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వి. సుశీల పాల్గొని మాట్లాడుతూ.. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల గర్భిణీలు, బాలింతలు ఇతరులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. సిరి ధాన్యాల ఉపయోగాలు గురించి వివరించారు.