మేడే పోస్టర్లను ఆవిష్కరించిన TUCI నాయకులు

మేడే పోస్టర్లను ఆవిష్కరించిన TUCI నాయకులు

NRML: లక్ష్మణాచందా మండలం వడ్యాల్ బీడీ ఫ్యాక్టరీలో TUCI ఆధ్వర్యంలో గురువారం మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి గంగన్న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. శ్రమదోపిడికి వ్యతిరేకంగా కార్మిక శక్తులు ఉద్యమించిన రోజు మేడే అని, మేడే ఉత్సవాలను కార్మికులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.