నేర నియంత్రణే లక్ష్యం: ఎస్పీ
నెల్లూరు: జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.