నార్కో టెర్రరిజం: J&Kలో ED కీలక సోదాలు

నార్కో టెర్రరిజం: J&Kలో ED కీలక సోదాలు

జమ్మూ కాశ్మీర్‌లో ED ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు నిర్వహించింది. నార్కో టెర్రరిజం (మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా నిధుల సేకరణ) కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ మీదుగా జమ్మూకాశ్మీర్‌కు నిధులు బదిలీ చేస్తూ, భారత్‌లోని ఉగ్రవాద గ్రూప్‌లకు ఆర్థిక సాయం చేస్తున్న ముఠాపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులు కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి.