పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశం
CTR: రంజాన్ నెల ప్రారంభమైన సందర్భంగా పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో సీఐ సుబ్బరాయుడు శుక్రవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని మతాల పెద్దలు సమావేశానికి హాజరయ్యారు. అందరూ సంయమనంతో శాంతి యుతంగా అందరూ కలసి అన్నదమ్ముల మాదిరిగా రంజాన్ పండుగ నెలను జరుపుకోవాలని సూచించారు.