జెండా ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

BDK: 79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రగతి మైదానంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.