VIDEO: 'గో రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి'
NRML: గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. ఖానాపూర్ పట్టణంలో, ఇతర గ్రామాల నుంచి విచ్చలవిడిగా గో రవాణా జరుగుతుందని ఆరోపించారు. గో అక్రమ రవాణా జరగకుండా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.