ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో GHMC నిధులతో నిర్మించిన ఇండోర్ ఓపెన్ జిమ్‌ను MLA సుధీర్ రెడ్డి, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీల్లో స్థలాన్ని వృథా చేయకుండా ఓపెన్ జిమ్, ఇంకుడుగుంత, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం ప్రజలకు మంచిదన్నారు.