నర్సాపురంలో సందడి చేసిన నటి అనసూయ
W.G: నర్సాపురంలో నటి అనసూయ సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె రావడంతో అభిమానులు అక్కడికి పోటెత్తారు. సెల్ఫీల కోసం జనం పోటీ పడగా, 'రంగస్థలం' పాటకి ఆమె వేసిన స్టెప్పులు స్పెషల్ నిలిచాయి. మండుటెండలోనూ తన కోసం వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరడం అభిమానులకు ఆకట్టుకుంది.