'తుఫాన్‌పై అధికారుల అలెర్ట్‌గా ఉండాలి'

SKLM: తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని టెక్కలి ఆర్డీఓ సుదర్శన్ దొర అన్నారు. శనివారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.