పిచ్చికుక్క దాడి.. ఉడిపడిన వేలు

పిచ్చికుక్క దాడి.. ఉడిపడిన వేలు

WGL: పర్వతగిరి మండలం కల్లెడలో మంగళవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలోని పలువురిపై దాడి చేసిన కుక్క, చిరుత సతీశ్‌పై దాడి చేయగా అతడి ఎడమ చేతి ఉంగరం వేలు తెగి పడింది. తీవ్ర గాయాలతో బాధితుడు నొప్పితో విలవిలలాడాడు. స్థానికులు అప్రమత్తమై కుక్కును తరిమివేసి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల సమస్యను పరిష్కారించాలన్నారు.