రేపటి నుంచి బోయకొండలో లక్ష కుంకుమార్చన

CTR: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో రేపటి(బుధవారం) నుంచి లక్ష కుంకుమార్చన ప్రారంభమవుతుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏకాంబరం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజులపాటు కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఉభయం చెల్లించిన దంపతుల ఆధ్వర్యంలో అర్చన, పూజలు నిర్వహిస్తామన్నారు.