VIDEO: జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు
అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. మొబైల్ వినియోగం, అధిక వేగం, ట్రిపుల్ రైడింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పత్రాలు లేని వాహనదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.