నేడు రాజోలులో సందడి చేయనున్న జబర్దస్త్ ఆర్టిస్టులు

E.G: రాజోలు నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దేవా వరప్రసాద్ శుక్రవారం రాజోలు నియోజకవర్గంలో విజయీభవ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మలికిపురం మండలం గూడపల్లిలో జబర్దస్త్ నటుడు బాబి మాట్లాడుతూ.. మ. 3 గంటలకు సఖినేటిపల్లి రేవు నుండి తాటిపాక వరకు జరిగే ఈ ర్యాలీలో తనతో పాటుగా జబర్దస్త్ నటులు గెటప్ శ్రీను, అశోక్ పాల్గొంటున్నారన్నారు.