'సనాతన ధర్మ రక్షణలో సగరులు ముందుండాలి'

SRD: కంగ్టి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద భగీరథ మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలం సగర సంఘం అధ్యక్షుడు మారుతి సాగర్ మాట్లాడుతూ.. సనాతన ధర్మ రక్షణలో సగరులు ముందుండాలన్నారు. సగరులు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గణపతి, పెంటన్న, మాదన్న, సాయిలు తదితరులు ఉన్నారు.