జగదీశ్ రెడ్డిని కలిసిన 8 వ వార్డు కౌన్సిలర్
SRPT: సూర్యాపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని 8వ వార్డు కౌన్సిలర్ ఇందుశ్రీ అనిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అలాగే పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న కొన్ని సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కౌన్సిలర్‌కి సూచించారు.