ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం

ఒక్క విద్యార్థి కోసం పరీక్ష కేంద్రం

ప్రకాశం: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షను కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే రాశాడు. ఈ సబ్జెక్టును జిల్లాలో ఎవరూ ఎంచుకోకపోవడంతో పామూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఈశ్వరరెడ్డి ఎంచుకున్నాడు. కేవలం ఒకే అభ్యర్థి కోసం పరీక్షా కేంద్రాన్ని నిర్వహించినట్లు ఆర్‌ఐవో ఆంజనేయులు వెల్లడించారు.