కామారెడ్డిలో రికార్డు స్థాయిలో రక్తదానం
KMR: అంబేద్కర్ జయంతి వేళ KMR లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రికార్డు స్థాయిలో 189 యూనిట్ల రక్తం సేకరించారు. రక్తదాతల సమూహం, ఐవీఎఫ్, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు. రక్తదాతలకు హెల్మెట్లు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. తలసేమియా చిన్నారులను కాపాడేందుకు ఇలాంటి సేవా కార్య క్రమాలు అభినందనీయమన్నారు.