ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహణ
NDL: కొలిమిగుండ్ల మండలం కోరుమానుపల్లె గ్రామ సమీపంలో ఉన్న గుండం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం టీడీపీ నాయకుడు ఇటిక్యాల బాలిరెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.