రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగాలి

అన్నమయ్య: రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగాలని అన్నమయ్య జిల్లా సాధన కమిటీ ఉపాధ్యక్షులు సిబ్యాల విజయభాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో కష్టాల తర్వాత సాధించిన జిల్లా కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు తొలగించరాదన్నారు. ఈ విషయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవ తీసుకుని రాయచోటినే జిల్లా కేంద్రంగా నిలబెట్టాలని కోరారు.