ఎన్జీరంగాకు రైతులు అంటే ఎంతో ఇష్టం: సీఎం

ఎన్జీరంగాకు రైతులు అంటే ఎంతో ఇష్టం: సీఎం

AP: రైతుల హక్కుల కోసం ఎన్జీరంగా అనేక పోరాటాలు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయనకు రైతులు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. 'ఎన్జీరంగా ఎప్పుడూ రైతుల మేలు కోసమే మాట్లాడేవారు. రైతు ఎప్పుడూ బాగుండాలని కోరుకునేవారు. ఆయన జీవితం నేటితరాలకు ఆదర్శం. ఎన్జీరంగా మంచి రచయిత, శాస్త్రవేత్త, తత్వవేత్త, ఇంగ్లిష్‌లో 65, తెలుగులో 15 పుస్తకాలు రాశారు' అని పేర్కొన్నారు.