నులిపురుగుల నిర్మూలనకు కృషి చేయాలి: వెంకట దాస్

NGKL: నులి పురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా డిప్యూటీ వైద్యాధికారి వెంకట దాస్ పిలుపునిచ్చారు. సోమవారం బిజినేపల్లి జడ్పీ బాలుర హై స్కూల్‌లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి మాట్లాడారు. బాల,బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. తినే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.