చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

అనకాపల్లి: ఎంపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.9,20,362 రూపాయల విలువగల చెక్కులను ఎంపీ సీఎం రమేష్ నలుగురు లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి మంజూరైనట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.