రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కారం: కలెక్టర్

MBNR: జిల్లాలోని మూసాపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా భూభారతి రెవెన్యూ సదస్సులకు ఎంపిక కావడంతో మొదటి రోజు మండలంలోని చక్రాపూర్, తుంకినీపూర్ గ్రామాలలో ప్రజల నుంచి రెవెన్యూ అధికారులు వినతులు స్వీకరించారు. ఈ చక్రపూర్‌లో నిర్వహించిన భూభారతి కేంద్రాన్ని కలెక్టర్ విజయేంద్రబోయి సోమవారం పరిశీలించారు.