శక్తిపీఠంలో ఘనంగా ఉగాది పండుగ వేడుకలు
NRPT: పట్టణంలోని శక్తిపీఠంలో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆస్థాన దేవత మహాలక్ష్మి అమ్మవారికి పీఠం వ్యవస్థాపకులు శాంతానంద్ పురోహిత ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శ్రీ శారదాంబ కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణం చేశారు. రాశి ఫలాలు భక్తులకు వివరించారు. అనంతరం ఉగాది పురస్కారాలు అందించారు.