'PGRS ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి'

'PGRS ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి'

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించిన 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక'లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన 114 ఆర్జీలపై ఆయన సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును అత్యధిక ప్రాధాన్యతతో, చట్టపరిధిలో నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఆదేశించారు.