రూ.5 లక్షలతో వీరభద్ర స్వామి టెంపుల్ అభివృద్ధి పనులు
BPT: అద్దంకిలోని రెడ్డి రాజుల నాటి పురాతన వీరభద్ర స్వామి టెంపుల్‌ను రూ.5 లక్షలు, దాతల విరాళాలతో అభివృద్ధి చేస్తున్నట్లు అద్దంకి గ్రూపు టెంపుల్స్ ఈవో పి.శైలేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈవో మాట్లాడుతూ.. దేవస్థానం చుట్టూ ప్రహరీ, రెండు ముఖద్వారాలు, ఆవరణలో మెరక లేపి గ్రానైట్ రాళ్లతో పరుస్తామన్నారు.