కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన హోం మంత్రి
AKP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నక్కపల్లి మండలం బొదిగల్లం గ్రామంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత భోజనం చేశారు. ఈ మేరకు కార్యకర్తల యోగక్షేమలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.