6 మండలాల ఎంపీడీవోలతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

6 మండలాల ఎంపీడీవోలతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి 6 మండలాల ఎంపీడీవోలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.