'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
ATP: పరిసరాల ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా విద్యార్థులకు సూచించారు. గురువారం గుత్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 'మన పరిశుభ్రత-మన ఆరోగ్యం'పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కమిషనర్ మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.