పంట నష్టాన్ని పరిశీలించిన అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్
ప్రకాశం: ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని, నష్టపోయిన పంటలకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.