'విద్యార్థులలో ఆరోగ్యంతో పాటు ఆనందం'
విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య మరింత అనుబంధాన్ని పెంచడానికి, భయాన్ని తొలగించడానికి ఒక వినూత్న కార్యక్రమే మన్యం డాన్స్ అని కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులలో మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, ప్రతి శనివారం ఉదయం హ్యాపీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.