పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
WNP: గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం పెద్దమందడి, ఖిల్లా గణపురం మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్ని సందర్శించారు. పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు, సిబ్బంది విధుల నిర్వహణను గమనించారు.