VIDEO: గ్యాస్ కొరతతో రహదారిపై ఆందోళన
నిర్మల్ జిల్లాలో గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే బైంసాలో ప్రజలు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఏజెన్సీ నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్న సిలిండర్లు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నెలకొంది.