ఆమరణ నిరాహార దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
KMM: ఈనెల 26న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు పోస్టర్‌ను MLA రాగమయి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నేతలు మాట్లాడుతూ.. ఈ నెల 26న జరిగే ఈ నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీసీ నాయకులకు,ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు BC సంఘం నాయకులు పాల్గొన్నారు.