మార్కెట్ యార్డులో నేటి పంట ఉత్పత్తుల ధరలు

మార్కెట్ యార్డులో నేటి పంట ఉత్పత్తుల ధరలు

MBNR: జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 48 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకువచ్చారు. మొక్కజొన్న 1,612 క్వింటాల్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ.2,067 లభించగా కనిష్ఠ ధర రూ.1,601 వచ్చింది. ఆముదాలు 6 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ. 5,770 లభించింది. వేరుశనగ 49 క్వింటాల్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ.5,112 పలికింది.