సర్పంచి అభ్యర్థి ఇంట్లో పేలిన సిలిండర్
KMR: గాంధారి మండలం చద్మల్ తండాలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రోజా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇంట్లో సామగ్రి కాలిపోయినట్లు చెప్పారు. సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.