యువకుడిపై ఎలుగుబంటి దాడి
NZB: సిరికొండ మండలం లొంక తాండకు చెందిన బాణవ అరవింద్ (18)పై ఎలుగుబంటి దాడి చేసింది. గురువారం లొంక సమీప అటవీ ప్రాంతంలోని ముక్క మైసమ్మ వద్ద దాడి చేసిందని బాధితుడు తెలిపారు. ఈ ఘటనలో అతని ఎడమ భుజానికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.