రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

BPT: సంతమాగులూరు మండలం పాత మొగులూరు వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.