సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ సీఎం జగన్ రావాలి: మంత్రి అంబటి

పల్నాడు: సీఎం జగన్ అందించిన పారదర్శక సంక్షేమ పథకాలు పేదల జీవన విధానాన్ని మెరుగుపరిచాయని, ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి బుల్లెట్‌పై ర్యాలీతో యాత్ర సాగించారు. అంబటి వెంట నియోజకవర్గ వైసీపీ సైన్యం తరలివెళ్లింది.