ఆదిత్యుని నేటి ఆదాయం

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.7,36,000, పూజలు, విరాళాల రూపంలో రూ.98252, ప్రసాదాల రూపంలో రూ.2,04000, శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వెల్లడించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.