విశాఖలో గూగుల్ డేటా సెంటర్

VSP: జిల్లాలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. విశాఖలో 6 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ఏర్పాటును ధ్రువీకరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కూడా అధికారికంగా నిర్ధరించింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో నిర్మాణం కానుంది.