37 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతేవాడ ఎస్పీ ఎదుట వారంతా తమ ఆయుధాలను వీడారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన 37 మందిలో 27 మందిపై రూ.65 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా 2024లో తుల్తులిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొనట్లు తెలిపారు.