ఘనంగా హనుమాన్ యాత్ర

ఘనంగా హనుమాన్ యాత్ర

WNP: ఆర్మూర్ పట్టణంలో బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు. మామిడిపల్లి అభయ వీర హనుమాన్ మందిరం, మామిడిపల్లి చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్, కింది బజార్ మీదుగా బయలుదేరుతుందని బజరంగ్ సభ్యులు తెలిపారు. యాత్ర చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు.