VIDEO: విశాఖ స్టేడియం వద్ద పండగ వాతావరణం

VIDEO: విశాఖ స్టేడియం వద్ద పండగ వాతావరణం

విశాఖలోని ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం అభిమానులతో కిటకిటలాడుతోంది. మ్యాచ్‌ను తిలకించేందుకు భారీ ఎత్తున జనం తరలిరావడంతో స్టేడియం ప్రాంగణమంతా జనసంద్రంగా మారింది. అభిమానులంతా టీమిండియా జెర్సీలు ధరించడంతో స్టేడియం పరిసరాలు నీలి రంగుతో నిండిపోయాయి. ఎటు చూసినా నీలివర్ణ శోభకనిపిస్తుండగా, అభిమానుల కేరింతలతో స్టేడియం వద్ద పండగ వాతావరణం నెలకొంది.