15ఏళ్ల క్రితమే మహేష్, రాజమౌళి కాంబో ఫిక్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబో 15ఏళ్ల క్రితమే ఖరారైందని నిర్మాత KL నారాయణ గతంలో చెప్పాడు. 'వారిద్దరి క్రేజ్ మరోస్థాయిలో ఉన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌లో మూవీ తీయనున్నట్లు వారే చెప్పారు. హాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను వద్దని రాజమౌళి నా కోసం సినిమా చేస్తున్నారు' అని ఆయన పేర్కొన్నాడు.