అధికార పార్టీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలి: సూర్య
ములుగు మండలం రామచంద్రపూర్, శ్రీనగర్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే మంత్రి సీతక్కతో కలిసి గ్రామాలకు మరింత అభివృద్ధి తెస్తామని హామీ ఇచ్చారు.